మానవ సంబంధాల్లో సమస్యలు రావడం సహజం. మీ మంచి ఫ్రెండ్‌ ఆఖరికి మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అయినాసరే, అతను అపరిపూర్ణుడు కాబట్టి తన మాటల ద్వారా, చేతల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. మీరు కూడా అపరిపూర్ణులే. కాబట్టి నిజం చెప్పాలంటే, మీవల్ల కూడా ఇతరులు బాధపడిన సందర్భాలు ఉండేవుంటాయి.​—యాకోబు 3:2.